పోస్ట్‌లు

🔴 Breaking News

ప్రొద్దుటూరు కమిషనర్ తూచ్.. ఎగ్జిబిషన్ అమౌంట్ చెల్లింపుకు వెసలుబాటు.!

చిత్రం
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ కు వెసలుబాటు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.  దసరా పండుగ అయ్యాక ఈనెల 26న పూర్తి అమౌంట్ చెల్లిస్తాడంటూ కమిషనర్ కలెక్టర్ కు లేఖ రాశారు. *గత నెల 28న ఎగ్జిబిషన్ వేలం నిర్వహించారు.  శివకుమార్ రూ.1,85,00,070(+33,30, 012జీఎస్టీ)లకు దక్కించుకున్నాడు.  వేలంలో రూ.25 లక్షలు చెల్లించాడు.  మిగతా అమౌంట్ 5 రోజుల్లోపు చెల్లించాలని కమిషనర్  మీడియా సాక్షిగా ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు.  కాగా.. ఈనెల 9వరకు అమౌంట్ చెల్లించని కాంట్రాక్టర్ వాయిదాల్లో చెల్లిస్తామని కమిషనర్ కు అఫిడవిట్ సమర్పించారు.  ఈమేరకు కమిషనర్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.  5 రోజుల్లో కట్టాల్సిన ఎగ్జిబిషన్ పూర్తి అమౌంట్ ను విడతల వారీగా ఈనెల 10, 17, 26 తేదీల్లో చెల్లిస్తాడని వెసలుబాటు ఇవ్వాలంటూ కమిషనర్ కలెక్టర్ కు విన్నవించారు.  గతంలో 2021లో భాస్కర్,  2022లో బలరామిరెడ్డి, 2023లో వెంకటరామిరెడ్డి, 2024లో చలపతి, 2025లో శివకుమార్ వాయిదాల్లో ఆలస్యంగా ఎగ్జిబిషన్ అమౌంట్ చెల్లించారంటూ కమిషనర్ కలెక్టర్ కు ...

మున్సిపల్ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.!

చిత్రం
ఏపీ మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్ల గెజిట్ విడుదల అక్టోబర్ 12, 2026 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు: ఎస్టీ 3, ఎస్సీ 14, బీసీ 36, మహిళా జనరల్ 27, అన్‌రిజర్వుడ్ 26 స్థానాలు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి అక్టోబర్ 12, 2026 తేదీతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గెజిట్‌లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా జనరల్, అన్‌రిజర్వుడ్ కేటగిరీల వారీగా స్థానాల వివరాలను పొందుపరిచారు. రిజర్వేషన్ల కేటగిరీల వారీగా స్థానాలు కేటగిరీ స్థానాలు ఎస్టీ (ST) 3 ఎస్సీ (SC) 14 బీసీ (BC) 36 మహిళా జనరల్ 27 అన్‌రిజర్వుడ్ 26 ఎస్టీ కేటగిరీ – 3 గూడూరు (నెల్లూరు), అల్లూరు, ఆత్మకూరు (కర్నూలు). ఎస్సీ కేటగిరీ – 14 చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల, ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల. బీసీ కేటగిరీ – 36 అల్లగడ్డ, సాలూరు, ...

శివాలయంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే.!

చిత్రం
ప్రొద్దుటూరు శివాలయంలో సోమవారం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.  దాతల సహకారంతో రూ.4.50 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ నిర్మించారు.  రూ.6 లక్షలతో ఆలయంలో షెడ్లు నిర్మించారు.  వీటిని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, ఆలోచి చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ, ధర్మకర్తల మండలి సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు. 

ఎగ్జిబిషన్ నుంచి కమిషనర్ కు ఎంత ముట్టింది .?:AISF నేతలు

చిత్రం
పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నిజాయితీపై AISF విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. AISF ఆధ్వర్యంలో సోమవారం ప్రొద్దుటూరు MRO కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా AISF నాయకులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి కమిషనర్ కు ఎంత అమౌంట్ ముట్టిందని ప్రశ్నించారు. ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నాడన్నారు. ఇక్కడి మాటలు అక్కడికి, ఇక్కడి మాటలు అక్కడికి చేరవేస్తున్నాడన్నారు. మున్సిపల్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ ఆదాయాన్ని మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం MRO ఉదయభాస్కర్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ప్రొద్దుటూరు డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాలస్వామి రెడ్డి.!

చిత్రం
ప్రొద్దుటూరు డిఎస్పీగా బాలస్వామి రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.  కడప జిల్లా దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీగా ఉన్న ఆయనను ప్రభుత్వం ప్రొద్దుటూరు డిఎస్పీగా నియమించింది.  ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరులో జాయిన్ అయ్యారు.  మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ను కలిశారు.  నూతన డిఎస్పి బాలస్వామి రెడ్డికి ప్రొద్దుటూరు డివిజనల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.  గతంలో బాలస్వామి రెడ్డి రాజుపాలెం ఎస్సైగా, ప్రొద్దుటూరు 1టౌన్ సీఐగా, ప్రొద్దుటూరు ఇంచార్జి డీఎస్పీగా పనిచేశారు.

జనసేనలో మాదాసు మురళికి కీలక బాధ్యతలు.!

చిత్రం
ప్రొద్దుటూరు జనసేన పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా మాదాసు మురళికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.  ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, ప్రొద్దుటూరు రూరల్ మండలము, రాజుపాలెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ కలుపుకొని పోతూ పార్టీ అభ్యర్థల ఎంపిక, గెలుపుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మురళి తెలిపారు.  

ప్రొద్దుటూరు వాసులు చాలా మంచివారు: ASP విభూకృష్ణ

చిత్రం
ప్రొద్దుటూరు వాసులు చాలా మంచివారని, వారి ఆదరణ అభిమానాలను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ASP విభూకృష్ణ తెలిపారు.  జిల్లా అధికారులు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తనకు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.   *ప్రొద్దుటూరు  నుంచి బదిలీ అయిన ఏఎస్పీ విభూకృష్ణ దంపతులకు స్థానిక పోలీస్ అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.  ప్రొద్దుటూరులో పోలీస్ శాఖకు, ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు.  కేసుల విచారణ, దర్యాప్తు, అరెస్ట్, రికవరీలో క్రింది స్థాయి అధికారులకు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు.  ASP విభూకృష్ణ ప్రొద్దుటూరులో కేవలం 10 నెలల పాటు మాత్రమే పని చేసినప్పటికీ, అందరి అభిమానాలను, ఆదరణను పొందారని ప్రశంసించారు.  సీఐలు నాగభూషణ్, కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయులు, భాస్కర్, ఎస్సైలు మధుసూదన్ రెడ్డి, మొయిద్దీన్, రాఘవేంద్ర రెడ్డి, మహబూబ్ బాషా, సంజీవరెడ్డి, శ్రీకాంత్, రాజు, భాస్కర్, ప్రణయ్ కుమార్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.